వీకెండ్ రిలీజ్

Wednesday,July 03,2019 - 03:20 by Z_CLU

ఈ వీకెండ్ నాలుగు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో అంచనాలు పెంచే సినిమాలు మాత్రం రెండే. సమంత నటించిన ఓ బేబీతో పాటు ఆది సాయికుమార్ చేసిన బుర్రకథ సినిమాల మధ్యే ప్రధానంగా పోటీ సాగనుంది.

బుర్రకథ.. ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా. ఒక మనిషికి రెండు బ్రెయిన్స్ ఉంటే అతడి పరిస్థితేంటి? అతడ్ని ప్రేమించిన అమ్మాయి పరిస్థితేంటనే విషయాన్ని హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనింగ్ గా చెప్పారు. డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి, నైరా షా హీరోయిన్లుగా నటించారు. ట్రయిలర్ ఇప్పటికే సూపర్ డూపర్ హిట్ అవ్వడం, స్టోరీలైన్ పై అందర్లో డిస్కషన్ జరగడంతో హాట్ కేక్ లా మారింది ఈ సినిమా.

బుర్రకథ టైపులోనే ఓ బేబీ కూడా డిఫరెంట్ కథతో వస్తోంది. 70 ఏళ్ల మహిళ, అకస్మాత్తుగా 24 ఏళ్ల పడుచుపిల్లగా మారిపోతే పరిస్థితేంటనేది ఈ సినిమా స్టోరీ. ఈ స్టోరీని కూడా వినోదాత్మకంగా చెప్పారు. బుర్రకథ లానే ఇక్కడ కూడా స్టోరీలైన్ ను దాచాలానే ప్రయత్నం చేయలేదు. ట్రయిలర్ లోనే మొత్తం చెప్పేశారు. ఇక బేబీ జర్నీని వెండితెరపై చూసి ఎంజాయ్ చేయాల్సిందే. కాకపోతే కామెడీతో పాటు సెకండాఫ్ లో ఎమోషన్ డోస్ కూడా కాస్త ఎక్కువే ఉన్నట్టుంది ఈ సినిమాలో. సమంత ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ కాగా.. రాజేంద్రప్రసాద్, రావు రమేష్ లాంటి నటులు ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్ లో నిలబెట్టారు.

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న మెయిన్ మూవీస్ ఇవి మాత్రమే. వీటితో పాటు కాకతీయుడు, దుర్మార్గుడు అనే మరో రెండు సినిమాలు వస్తున్నాయి. తారకరత్న హీరోగా నటించిన కాకతీయుడు సినిమాకు వి.సముద్ర దర్శకత్వం వహించారు. ఇక మాస్ మసాలా ఎలిమెంట్స్ తో తెరకెక్కిన దుర్మార్గుడు సినిమాలో విజయ్ కృష్ణ, ఫిర్దోస్ భాను హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు సునీల్ జంపా దర్శకత్వం వహించారు.