ఇస్మాట్ శంకర్ ట్రయిలర్ రివ్యూ

Wednesday,July 03,2019 - 05:24 by Z_CLU

సినిమాలో రామ్ పేరు ఇస్మాట్ ఉస్తాద్ శంకర్. దీన్ని కాస్త మార్చి ఇస్మాట్ ఉస్తాద్ మాస్ శంకర్ అని మార్చుకుంటే సరిపోద్ది. కొద్దిసేపటి కిందట విడుదలైన ఇస్మార్ట్ శంకర్ ట్రయిలర్ మాస్ కు మచ్చుతునకగా ఉంది. మాస్ ఎలిమెంట్ లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా లేదు.

ఇప్పటివరకు ఏ దర్శకుడూ చూపించని విధంగా రామ్ ను కంప్లీట్ మాస్ లుక్ లో చూపించాడు దర్శకుడు పూరి. టీజర్ లో ఆ లుక్ ను, మేనరిజమ్స్ ను కొద్దిగా రుచిచూపించిన పూరి.. ట్రయిలర్ లో ఏకంగా ఇస్మార్ట్ శంకర్ విశ్వరూపాన్ని ఆవిష్కరించాడు. ఇక థియేటర్లలోకొచ్చిన తర్వాత మాస్ జనాలకు ఫుల్ మీల్స్ గ్యారెంటీ.

పక్కా హైదరాబాదీ కుర్రాడిలా రామ్ అదరగొట్టాడు. లుక్ మాత్రమే కాదు, లాంగ్వేజ్ కూడా మార్చాడు. పూరి రాసిన డైలాగ్స్ ను ట్రయిలర్ లో రామ్ చెబుతుంటే అదిరిపోయింది. ఇక హీరోయిన్ నభానటేష్ కూడా తెలంగాణ యాసలో మాస్ డైలాగ్ చెప్పేసరికి కిక్ డబుల్ అయింది. దీనికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత కిక్ ఇచ్చింది.

ఓవరాల్ గా ఇస్మార్ట్ శంకర్ ట్రయిలర్ మాస్ మసాలా ఎలిమెంట్స్ తో నిండిపోయింది. హీరో మెదడులో చిన్న చిప్ అమర్చారని, దాని చుట్టూనే కథ తిరుగుతుందనే విషయాన్ని కూడా ట్రయిలర్ లో చెప్పేశారు. అలా డబుల్ దిమాక్ అనే ట్యాగ్ లైన్ కు జస్టిఫికేషన్ ఇచ్చారు. ఈనెల 18న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తున్నాడు ఇస్మాట్ శంకర్