శ్రీ విష్ణు ఇంటర్వ్యూ

Wednesday,November 06,2019 - 03:13 by Z_CLU

కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తూ హీరోగా తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శ్రీ విష్ణు ‘తిప్పరా మీసం’ తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే.

‘డీజే’గా కనిపిస్తా

ఇప్పటి వరకూ బాయ్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టర్స్ ప్లే చేసాను. ఫస్ట్ టైం ఈ సినిమాలో కొత్త లుక్ తో డిఫరెంట్ క్యారెక్టరైజేషణ్ చేసాను. సినిమాలో డీజేగా కనిపిస్తాను. కానీ డీజేగా ఇలాగే ఉండాలనే దానికి పూర్తి ఎగైనెస్ట్ గ కనిపిస్తాను. ముఖ్యంగా సినిమా కోసం ఎనిమిది కిలోలు పెరిగాను.


మీసం అనేది భాద్యత

జెనరల్ గా మగాడి పౌరుషం చూపించే సందర్భంలో మీసం తిప్పుతారు. కానీ సినిమాలో నేను కూడా తెలుసుకోకుండా అలాగే తిప్పుతుంటా కానీ మీసం అనేది మగాడికి ఓ బాధ్యత. ఆ భాద్యత తో చివరికి నేను క్లైమాక్స్ లో ఏం తెలుసుకున్నాను అనేది అందరికీ కనెక్ట్ అవుతుంది.

మా అసోసియేషన్ బాగుంది

ఇండస్ట్రీలో కొందరికి మాత్రమే మంచి అసోసియేషన్ కుదురుతుంది. అలా నాకు విజయ్ కి మంచి రిలేషన్ బిల్డ్ అయింది. అది ఈ సినిమాతో ఇంకా దృడంగా మారింది. ‘తిప్పరా మీసం’ తర్వాత విజయ్ డైరెక్షన్ గురించి అందరూ ఆలోచిస్తారు. శ్రీ విష్ణు నే ఇలా చూపించాడంటే ఒక పెద్ద హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తారు.

బెస్ట్ కంఫర్ట్

నేను చాలా మందితో నటించా. కానీ ఫస్ట్ టైం రోహిణి గారితో చాలా కంఫర్ట్ గా ఓ మదర్ లా భావించి నటించాను. మొదట ఆవిడతో కలిసి నటించడానికి ఇబ్బంది పడినప్పటికీ తర్వాత ఆమెలో మా అమ్మను చూసుకున్నాను. అందుకే సినిమాలో మా ఇద్దరి మధ్య సెంటిమెంట్ బాగా పండింది. సినిమాలో మిగతా వాటిని మదర్ ఎమోషన్ అనేది డామినేట్ చేస్తుంది.

క్రేజీ కామెడి

సినిమాలో కొన్ని పాత్రల ద్వారా ఎంటర్టైన్ మెంట్ పుడుతుంది. నా క్యారెక్టర్ లో కూడా సీరియస్ తో పాటు ఫన్ ఉంటుంది. అలా అని అది డైలాగ్ కామెడీ కాదు. క్రేజీ కామెడీ ఉంటుంది.

ఈసారి అది ఉంటుంది

నా సినిమాలు అందరూ బాగున్నాయని అంటున్నా కేవలం ఏ సెంటర్స్ లో రీచ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకో నా సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువగా ఉన్నందువల్లే బీ సెంటర్స్ ఆడియన్స్ కి రీచ్ అవ్వట్లేదు. ఈ కంటెంట్ ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించాం. అందువల్ల ఈసారి కమర్షియల్ ఎలిమెంట్స్ తో బీసీ ఆడియన్స్ ను కూడా మెప్పిస్తానని నమ్ముతున్నాను.

నాతో మళ్ళీ మళ్ళీ… అదే రీజన్

నేను పనిచేసిన దర్శక, నిర్మాతలు నాతో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలనుకుంటారు. దానికి కారణం షూటింగ్ కి టైంకి వెళ్ళడం, నా పని నేను చేసుకుంటూ వెళ్ళడం, డైరెక్టర్ చెప్పింది చేయడం అయి ఉంటుందనుకుంటున్నాను.

 

రెమ్యునరేషన్ పెంచలేదు

‘బ్రోచేవారెవరురా’ కంటే ముందే మూడు సినిమాలు కమిట్ అయ్యాను. వాటి తర్వాత రెమ్యునరేషన్ పెంచడం గురించి ఆలోచిస్తాను. ఆ మూడు సినిమాల్లో ఒకటి నారా రోహిత్ తో కలిసి చేస్తున్నాను. అది ఓ దేశభక్తితో తెరకెక్కే సినిమా, ప్రస్తుతం కథ సిద్దమవుతుంది. ఆ మూడు సినిమాలు డెబ్యూ డైరెక్టర్స్ తోనే చెస్తునాను.