వీకెండ్ రిలీజ్

Wednesday,September 25,2019 - 05:58 by Z_CLU

ఆల్రెడీ థియేటర్లలో బందోబస్త్, గద్దలకొండ గణేశ్, గ్యాంగ్ లీడర్ సినిమాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా మరో 5 సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ వారం రిలీజ్ అవుతున్న ఆ 5 సినిమాలపై ఓ లుక్కేద్దాం

రాయలసీమ లవ్ స్టోరీ
ఘాటైన కంటెంట్ తో ఎట్రాక్ట్ చేశారు. తర్వాత సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తమ్మీద ఈ సినిమాపై ఆడియన్స్ లో చిన్నపాటి డిస్కషన్ జరిగేలా చేయడంలో యూనిట్ సక్సెస్ అయింది. వెంకట్, హృశాలి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కవ్వించే సీన్స్ తో పాటు బలమైన సందేశం ఉందంటున్నారు యూనిట్ సభ్యులు.

నిన్ను తలచి
ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా వస్తున్న సినిమా ఇది. వంశీ, స్టెఫీ పటేల్ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. అనీల్ తోట ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. పోస్టర్లు, ట్రయిలర్ ఉన్నంతలో ఎట్రాక్ట్ చేసేలా ఉంది.

రామ చక్కని సీత
క్రొకడైల్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీహర్ష దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇంద్ర, సుక్రుతా హీరోహీరోయిన్లుగా పరిచయమౌతున్నారు. ఇందులో ఇంద్రకు ఇదే మొదటి సినిమా కాగా… సుక్రుత మాత్రం కన్నడంలో 6-7 సినిమాలు చేసింది. ఇది కూడా ప్రేమకథే.

ఈ మూవీస్ తో పాటు మిర్రర్, బీజే అనే మరో రెండు సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల్ని బేస్ చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు సాయికుమార్. శ్రీనాధ్, హరిత జంటగా నటించారు. ఇక బీజే అనే మరో చిన్న సినిమా కూడా వస్తోంది. బీజే అంటే బడుగు జీవులు అని అర్థం. కాలకేయ ప్రభాకర్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను రోబో సుధాకర్ డైరక్ట్ చేశాడు.