సైరాలో పాటలు.. జస్ట్ 2 మాత్రమే

Wednesday,September 25,2019 - 04:19 by Z_CLU

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇదే నిజం. సైరాలో ఫుల్ లెంగ్త్ సాంగ్స్ 2 మాత్రమే. మరో 2 పాటలు మాంటేజ్ సాంగ్స్ గా బ్యాక్ గ్రౌండ్ లో మాత్రమే వస్తాయి. ఇది రూమర్ కాదు. స్వయంగా సురేందర్ రెడ్డి చెప్పిన మేటర్.

అవును.. సైరా సినిమాలో చిరంజీవి, నయనతార, తమన్నపై ఫుల్ లెంగ్త్ సాంగ్స్ 2 మాత్రమే ఉన్నాయని, మరో 2 పాటలు మాంటేజ్ రూపంలో వస్తాయని స్పష్టంచేశాడు సురేందర్ రెడ్డి. అయితే జూక్ బాక్స్ లో మాత్రం అదనంగా మరో 4 సాంగ్ బిట్స్ ఉంటాయని అంటున్నాడు. మొత్తంగా జూక్ బాక్స్ లో 8 పాటలుంటాయట. కాకపోతే అవి కేవలం జూక్ బాక్స్ కే పరిమితమని, సినిమాలో ఉండవని క్లారిటీ ఇచ్చాడు.

అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది సైరా. పూర్తిగా కంటెంట్ పై ఫోకస్ పెట్టడంతో రన్ టైమ్ ను దృష్టిలో పెట్టుకొని పాటలు తగ్గించారు. చిరంజీవి సినిమాలకు సంబంధించి ఇలా పాటలు తగ్గించడం డేరింగ్ డెసిషన్.