వీకెండ్ రిలీజెస్

Thursday,July 11,2019 - 11:12 by Z_CLU

ప్రస్తుతం మార్కెట్లో బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ సినిమాలు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. ఇప్పుడు వీటికి పోటీకి మరికొన్ని సినిమాలు ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ శుక్రవారం 5 సినిమాలు వస్తున్నాయి.

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్నాడు. అతడు నటించిన దొరసాని సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. అంతేకాదు, ఇదే సినిమాతో రాజశేఖర్ చిన్నకూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా పరిచయమౌతోంది. వీళ్లిద్దరు మాత్రమే కాదు, ఈ సినిమాతో కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. ఈ ముగ్గురికీ ఈ సినిమా చాలా కీలకం. ఆల్ ది బెస్ట్ టు ఆల్.

వీళ్లు మాత్రమే కాదు, మరో నటవారసుడు కూడా ఈ వీకెండ్ థియేటర్లలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అతడే మేఘామ్ష్. నటుడు శ్రీహరి తనయుడు ఇతడు. మేఘాంశ్ డెబ్యూ మూవీ రాజ్ దూత్ రేపు థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే పలువురు సినీప్రముఖులు మేఘాంశ్ కు మద్దతుగా వీడియో బైట్స్ రిలీజ్ చేశారు. అతడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. రాజ్ దూత్ హిట్ అయితే శ్రీహరి కొడుకు ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నట్టే. ఆల్ ది బెస్ట్ మేఘాంశ్.

ఈ నటవారసులకు పోటీగా దూసుకొస్తున్న సినిమా నిను వీడని నీడను నేనే. లాంగ్ గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ నుంచి వస్తున్న సినిమా ఇది. ఈ మూవీకి ఓ స్పెషాలిటీ ఉంది. కేవలం సందీప్ ఇందులో నటించడం మాత్రమే కాదు, తొలిసారిగా డబ్బులు పెట్టి నిర్మాతగా కూడా మారాడు. సో.. ఇతడికి కూడా ఓ నటుడిగా కాకుండా, నిర్మాతగా కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. ఆల్ ది బెస్ట్ సందీప్.

ఈ సినిమాలతో పాటు కేఎస్ 100, మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే మరో రెండు సినిమాలు కూడా ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్నాయి. ఓ కొత్త కాన్సెప్ట్ తో కేఎస్100 తెరకెక్కిందంటున్నారు మేకర్స్. అటు అన్నీ తానై ఆర్.నారాయణమూర్తి తీసిన సినిమా మార్కెట్లో ప్రజాస్వామ్యం. ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి ప్రమోషన్ ఇవ్వడం విశేషం. ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.