పందెంకోడి-2 సెట్స్ లో జాయింట్ గా సంబరాలు

Monday,June 25,2018 - 04:28 by Z_CLU

కీర్తిసురేష్ నటించిన మహానటి సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. ఇక విశాల్ నటించిన అభిమన్యుడు సినిమా సూపర్ హిట్ అయింది. ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. కాస్ట్ అండ్ క్రూ అంతా సెపరేట్. కానీ ఈ రెండు సినిమా సక్సెస్ సంబరాల్ని హీరోహీరోయిన్లు కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. పందెంకోడి-2 సెట్స్ దీనికి వేదికైంది

ప్రస్తుతం విశాల్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా పందెంకోడి-2 సినిమా తెరకెక్కుతోంది. రెండు సూపర్ హిట్స్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తుండడంతో.. యూనిట్ ఇలా జాయింట్ గా సక్సెస్ ను సెలబ్రేట్ చేసింది.

ఓవైపు బ్లాక్ బస్టర్ మహానటి అంటూ ఓ కేక్. ఆ పక్కనే బ్లాక్ బస్టర్ అభిమన్యుడు అంటూ మరో కేక్. ఇలా రెండు కేకుల్ని హీరోహీరోయిన్లు ఇద్దరూ జాయింట్ గా కట్ చేశారు. పందెంకోడి-2 యూనిట్ తో సరదాగా సెల్ఫీలు దిగారు.

ఇక పందెంకోడి-2 సినిమా విషయానికొస్తే.. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. గతంలో ఇదే హీరో, ఇదే దర్శకుడి కాంబోలో వచ్చిన పందెంకోడి సినిమా యాక్షన్ మూవీస్ లోనే ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తమిళ్ లోనే కాకుండా, తెలుగులో కూడా పెద్ద హిట్ అయింది.

విశాల్ ను పూర్తిస్థాయి మాస్ హీరోగా మార్చింది పందెంకోడి సినిమా. అలాంటి సినిమాకు ఇన్నేళ్లకు సీక్వెల్ వస్తోంది. సీక్వెల్ మరింత పవర్ ఫుల్ గా ఉండబోతోందని అంటున్నారు విశాల్-లింగుస్వామి. మహానటి, అభిమన్యుడు సినిమాల్ని మించేలా పందెంకోడి-2 హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు.