కాజల్ అగర్వాల్ తో రెండోసారి...

Monday,June 25,2018 - 05:21 by Z_CLU

బెల్లంకొండ శ్రీనివాస్ ‘సాక్ష్యం’ జూలై 20 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. మరోవైపు డెబ్యూ డైరెక్టర్ శ్రీనివాస్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్స్ బిగిన్ చేసే శ్రీనివాస్, ఈ సినిమా తరవాత దర్శకుడు తేజ డైరెక్షన్ లో నటించనున్నాడు. అయితే ఈ సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ తో జోడీ కట్టనున్నాడు శ్రీనివాస్.

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తరవాత  బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు దర్శకుడు తేజ. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని రిఫర్ చేశాడట తేజ. ఈ విషయం ఇప్పటి వరకు అఫీషియల్ గా కన్ఫం అయితే కాలేదు కానీ ఆల్మోస్ట్ కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే అని తెలుస్తుంది.

నల్లమలుపు బుజ్జి నిర్మించనున్న ఈ సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.