ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లు

Monday,June 25,2018 - 04:06 by Z_CLU

ప్రేక్షకుల కలల్లో చాలా కాంబినేషన్లు రౌండ్స్ కొడుతుంటాయి. కానీ కొన్ని మాత్రమే వర్కవుట్ అవుతుంటాయి. అయితే వీటికి భిన్నంగా కిక్కిచ్చే కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. ఇవి మరీ ఫాంటసీలు కూడా కావు. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు డిస్కషన్ కిందకు వచ్చినవే. అలాంటి కిక్ లాంటి కొన్ని కాంబినేషన్లు ఇప్పుడు చూద్దాం

ప్రభాస్-బోయపాటి
యంగ్ రెబల్ స్టార్ అభిమానులంతా కోరుకునే కాంబో ఇది. మాస్ కు కేరాఫ్ అడ్రస్ వీళ్లిద్దరూ. కానీ ఇప్పటివరకు కలిసి పనిచేయలేదు. ప్రాజెక్టు సెట్ అయితే కనుక కెవ్వు కేకే. ఇప్పటికప్పుడు కాకపోయినా, ఫ్యూచర్ లో బోయపాటి డైరక్షన్ లో ప్రభాస్ మూవీ కచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.

పవన్-కొరటాల
ఈ కాంబినేషన్ ప్రస్తుతానికి కాస్త ఫాంటసీలా అనిపించొచ్చు కానీ పవన్ తిరిగి సినిమాలు స్టార్ట్ చేస్తే మాత్రం వర్కవుట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే తన సినిమాల్లో సందేశాలివ్వడానికి ఇష్టపడతాడు కొరటాల. అలాంటి సందేశాల్ని ఎక్కువగా ఇష్టపడతాడు పవన్. సో.. కొరటాల అడిగితే పవన్ కాదనకపోవచ్చు. కానీ అన్నీ ఎన్నికల తర్వాతే.

అల్లుఅర్జున్-రాజమౌళి
హీరో క్యారెక్టర్లు డిజైన్ చేయడంలో రాజమౌళి మొనగాడు. ఎలాంటి క్యారెక్టర్ లోనైనా హండ్రెడ్ పర్సెంట్ లీనమైపోయి, పూర్తిగా ప్రాణం పెట్టే హీరో బన్నీ. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఆ క్యారక్టరైజేషన్ ఎలా ఉంటుందో ఊహకు కూడా అందదు. అందుకే బన్నీ-జక్కన్న కాంబో కోసం మెగా ఫ్యాన్స్ కోటి కళ్లతో వెయిటింగ్. బన్నీ కూడా రెడీనే కానీ కాంబినేషన్ సెట్ అవ్వడానికి ఇంకాస్త టైం పడుతుంది

మహేష్-శేఖర్ కమ్ముల
ప్రేమకథల ఎక్స్ పెర్ట్ శేఖర్ కమ్ముల. ఇలాంటి దర్శకుడి సినిమాలో మహేష్ బాబును క్యూట్ లవర్ బాయ్ గా చూడాలని అందరికీ ఉంటుంది. మహేష్ కూడా ఇతడి డైరక్షన్ లో చేయడానికి సిద్ధమే. కానీ స్టోరీనే సెట్ అవ్వట్లేదు. ఫిదా స్టోరీ ఫస్ట్ మహేష్ కే వెళ్లింది. కానీ ఆ క్యారెక్టర్ కు తను సూట్ కానని చెప్పేశాడట. మహేష్ కూ సూటయ్యే మరో కథతో కమ్ముల ఎప్పుడు తెరపైకొస్తాడో..?

ఎన్టీఆర్-క్రిష్
గుండెలు బరువెక్కిపోయేంతలా ఎమోషన్ పండించాలి..
మనసుకు తృప్తి కలిగేలా నటించాలి..
తనలో నటుడ్ని సరికొత్త కోణంలో చూపించే దర్శకుడు కావాలి..
ఎన్టీఆర్ మైండ్ సెట్ ఇది. ఎప్పుడూ అలాంటి క్యారెక్టర్లు, డైరక్టర్ల కోసం ఎదురుచూస్తుంటాడు ఎన్టీఆర్. సరిగ్గా ఆ కోవకు చెందిన దర్శకుడే క్రిష్. గతంలో ఓసారి వీళ్లిద్దరూ కలిసి పనిచేసే ఛాన్స్ మిస్ అయింది. ఈసారి క్రిష్ దర్శకత్వంలో అవకాశం వస్తే వదులుకోనని ఎన్టీఆర్ ప్రకటించాడు.

రామ్ చరణ్ – త్రివిక్రమ్
త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని ప్రతి హీరో కోరుకుంటాడు. చెర్రీకి కూడా అదే కోరిక. పైగా బన్నీ ఇప్పటికే త్రివిక్రమ్ తో 2 సినిమాలు చేసేశాడు. ఈసారి చరణ్ తో త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాబోయే 2-3 ఏళ్లలో వీళ్ల కాంబినేషన్ వర్కవుట్ అయ్యే ఛాన్స్ ఉంది

నాని-విక్రమ్ కుమార్
ఇది కూడా కాస్త గమ్మత్తయిన కాంబినేషనే. పాత్రలతో ప్రయోగాలు చేసే రకం నాని. ఏకంగా కథలతోనే ప్రయోగాలు చేసే రకం విక్రమ్ కుమార్. వీళ్లిద్దరూ కలిస్తే అదో పెద్ద ప్రయోగాత్మక చిత్రం అవుతుంది. ప్రస్తుతానికైతే ఇద్దరి మధ్య చర్చలు సాగుతున్నాయి. సినిమా ఎప్పుడు ఎనౌన్స్ అవుతుందో చూడాలి.

నాగచైతన్య-మణిరత్నం
అక్కినేని అభిమానుల ఊహల్లో తేలుతున్న కాంబినేషన్ ఇది. నాగార్జునకు గీతాంజలి లాంటి క్లాసిక్ ను అందించిన మణిరత్నం, నాగచైతన్యకు కూడా కలకాలం గుర్తుండిపోయే అలాంటి ఓ మరపురాని చిత్రాన్ని అందిస్తే చూడాలని అభిమానులే కాదు, ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఈ కాంబో సెట్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే కథ సెట్ అవ్వాలంతే.