వినాయక చవితి స్పెషల్

Thursday,September 13,2018 - 10:11 by Z_CLU

ఎక్కడ చూసినా వినాయక చవితి సంబరాలు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ రోజు ఈ సంబరాలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు నుండి బిగిన్ అయితే వినాయక నిమజ్జనం వరకు ఏ వీధిన చూసిన వినాయకుడి మండపాలే… వినాయకుడి పాటలే. ఈ పండక్కి అంత విశిష్టత ఉంది కాబట్టే తెలుగు సినిమాల్లోను ఆ పాటలకు చోటు దక్కింది. సినిమాలో సందర్భానుసారంగా ఉండే ఈ సాంగ్స్ , మ్యూజిక్ లవర్స్ ని ఇప్పటికీ మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాయి.

అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. గణపతి బప్పా మోరియా అంటూ వెస్ట్రన్ స్టైల్ లో కంపోజ్ అయిన సాంగ్, యూత్ కి మోస్ట్ ఫేవరేట్ సాంగ్.

యూత్ కి కూడా ఈజీగా ఎక్కేసేలా ఉండే లిరిక్స్ తో కంపోజ్ అయిన ఈ సాంగ్ 100% లవ్ సినిమాలోది.ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ గా నిలిచింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.

బాలయ్య బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘డిక్టేటర్’ సినిమాలోది ఈ సాంగ్. శ్రీవాస్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ సాంగ్ ఇప్పటికీ వినాయకుడి సంబరాల్లో వినిపిస్తూనే ఉంటుంది.

మెగాస్టార్ ‘జై చిరంజీవ’ సినిమాలోదీ సాంగ్. విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలోని సాంగ్, ప్రతి వినాయక చవితి ప్లే లిస్టు లో కంపల్సరీగా ఉండాల్సిందే. ఈ పాటని మణిశర్మ కంపోజ్ చేశాడు.

వెంకటేష్ కూలీ నం 1 సినిమాలోదీ సాంగ్. సినిమాలో సందర్భానుసారంగా ఉండబోయే ఈ సాంగ్ ఇప్పటికీ సూపర్ హిట్టే. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

రామ్ పోతినేని గణేష్ సినిమాలో కూడా వినాయకుడి పాటకు స్పెషల్ ప్లేస్ దక్కింది. అటు హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూనే వినాయకుడి పై భక్తితో తెరకెక్కించిన పాట ఇది. మిక్కీ. జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా M. శరవణన్ డైరెక్షన్ లో తెరకెక్కింది.

కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘దేవుళ్ళు’ సినిమాలోది సాంగ్. తల్లిదండ్రులు చేసిన మొక్కును పిల్లలు తీర్చే క్రమంలో ఉండే సాంగ్ ఇది. బాలసుబ్రహ్మణ్యం ఈ పాటను పాడాడు. నటించాడు కూడా. వందేమాతరం శ్రీనివాస్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్.