వినాయకచవితి సూపర్ హిట్ సినిమాలు

Thursday,September 13,2018 - 10:30 by Z_CLU

పండగ కి వచ్చి హిట్స్ సాదించిన సినిమాలు ప్రేక్షకులకు స్పెషల్ గా గుర్తుంటాయి. అలాంటి సినిమా పండగలలో  వినాయకచవితి కూడా ఒకటి. వినాయకచవితి కానుకగా విడుదలై  బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్స్ గా నిలిచిన సినిమాలపై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ..

‘లౌక్యం’ సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2014 లోవినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 26 న విడుదలైన ఈ సినిమా గోపి చంద్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.. శ్రీ వాస్ డైరెక్షన్ ఫుల్లెంగ్త్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించి వినాయక చవితి విజయవంతమైన సినిమాగా నిలిచింది.

2015 లో సెప్టెంబర్ 24 న  విడుదలైన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’  సాయి ధరం తేజ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసి సూపర్ హిట్ గా నిలిచింది.  హరీష్ శంకర్ డైరెక్షన్ లో యూత్ ఫుల్ కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం అందుకొని వినాయకచవితి స్పెషల్ హిట్ అనిపించుకుంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఇది. 2016 సెప్టెంబర్ 1 న విడుదలైన ఈ సినిమా  నాలుగు రోజుల ముందే అభిమానుల్లో  పండగ  వాతావరణాన్ని క్రియేట్ చేసి బాక్సాఫీస్ దగ్గర  బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. కొరటాల శివ డైరెక్షన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా సినిమా అభిమానులందరినీ ఆకట్టుకొని అప్పటి వినాయక చవితి ని మరింత స్పెషల్ గా మర్చేసింది.

టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ అయిన ‘అర్జున్ రెడ్డి’ కూడా గతేడాది వినాయక చవితి రోజు విడుదలై గ్రాండ్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో రాత్రి కి రాత్రి స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకొని వరుస ఆఫర్స్ అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డి తెలుగు సినిమా అభిమానుల్లో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి 2017 బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు.

ఇలా ప్రతీ వినాయక చవితికి టాలీవుడ్ లో ఓ సూపర్ హిట్ డెలివరీ అవుతూ వస్తుంది….అందుకే ఈ ఏడాది కూడా ఆ వినాయకుడి ఆశీస్సులతో నాగ చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ థియేటర్స్ లోకి వచ్చింది. మారుతీ డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా నేటి నుండి ప్రేక్షకులను అలరించబోతుంది.

నాగ చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి’ తో పాటే సమంత నటించిన ‘యూ -టర్న్’ కూడా వినాయక చవితి కానుకగా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది.. కన్నడ ‘యూ టర్న్’ సినిమాకు రిమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు పవన్ కుమార్ దర్శకుడు.