ఆ డైరెక్టర్ తో విజయ్ ఫిక్స్ !

Sunday,November 03,2019 - 03:05 by Z_CLU

ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ నెక్స్ట్ పూరి జగన్నాథ్ తో ‘ఫైటర్’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జనవరిలో స్టార్ట్ చేయబోతున్న రౌడీ ఆ తర్వాత మొదటి షెడ్యుల్ జరుపుకొని ఆగిన ‘హీరో’ సినిమాను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు.

‘హీరో’ సినిమా తర్వాత విజయ్ లిస్టులో దర్శకుడు శివ నిర్వాణ వినిపించింది. ‘నిన్ను కోరి’,’మజిలీ’ సినిమాలతో తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్న శివ ఇటివలే విజయ్ కి ఓ కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. తాజా శివ నిర్వాణతో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు విజయ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా కూడా శివ నిర్వాణ గత సినిమాల్లాగే రొమాంటిక్ ఎమోషనల్ కథతోనే తెరకెక్కనుందని సమాచారం.