వరుణ్ తేజ్ సినిమాకు మహేష్ హీరోయిన్ ?

Sunday,November 03,2019 - 04:02 by Z_CLU

మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన కియరా అద్వాని రెండో సినిమాగా రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఇంత వరకూ తెలుగులో మరో సినిమా సైన్ చేయలేదు కియరా.

ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఈ బ్యూటీను తాజాగా వరుణ్ తేజ్ కొత్త సినిమాకు సంప్రదించారట నిర్మాతలు. స్క్రిప్ట్ నచ్చడంతో కియరా కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే టాక్ వినిపిస్తుంది. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా కియరా ఆల్మోస్ట్ కన్ఫర్మ్  అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.