మొదటి సినిమా సెంటిమెంట్ తో

Sunday,November 03,2019 - 12:15 by Z_CLU

ఎవరికైనా మొదటి సినిమా అనేది చాలా కీలకం. ఆ సినిమాను బట్టే నటుడికైనా దర్శకుడికైనా ఓ కెరీర్ ఉంటుంది. షార్ట్ ఫిలింస్ లో నటించిన రాజ్ తరుణ్ ని మొదటి సినిమా ‘ఉయ్యాల జంపాల’ మంచి దారి చూపించింది. ఆ సినిమా తర్వాత ఈ కుర్ర హీరోకి అరడజను ఛాన్సులొచ్చాయి.

అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ కెరీర్ కాస్త డౌన్ లో ఉంది. వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు. అందుకే తన అప్ కమింగ్ సినిమా ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాను తన మొదటి సినిమా విడుదలైన రోజే రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. 2013 లో డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా విడుదలైంది ‘ఉయ్యాల జంపాల’. ఇప్పుడు ‘ఇద్దరి లోకం ఒకటే’ కూడా సరిగ్గా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఎలాంటి సక్సెస్ సాదిస్తాడో చూడాలి.