జీ ఎక్స్ క్లూజివ్: మరో మూవీ ఫిక్స్ చేసిన దేవరకొండ

Thursday,November 28,2019 - 11:55 by Z_CLU

హీరో విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్న ఈ హీరో, ఆ మూవీ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు వీటికి తోడు మరో సినిమా ఫిక్స్ చేశాడు.

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దేవరకొండ. ఈ మేరకు విజయ్-ఇంద్రగంటి మధ్య స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి. అయితే ఈ సినిమా అప్పుడే సెట్స్ పైకి రాదు.

ఎందుకంటే.. వరల్డ్ ఫేమస్ లవర్ పూర్తయిన తర్వాత ఫైటర్ మూవీ చేస్తాడు దేవరకొండ. ఆ తర్వాత శివనిర్వాణ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఈ గ్యాప్స్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై హీరో అనే సినిమాను అతడు పూర్తిచేయాల్సి ఉంటుంది.

ఈ కమిట్ మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాతే ఇంద్రగంటి సినిమా ఉంటుంది. అటు ఇంద్రగంటికి కూడా అంత తొందరేం లేదు. నాని, సుధీర్ బాబు హీరోలుగా V అనే సినిమా పూర్తిచేసి, ఆ తర్వాత నిదానంగా విజయ్ దేవరకొండ సినిమాకు ప్రీ-ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాడు.