మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Thursday,November 28,2019 - 12:16 by Z_CLU

వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది నభా నటేష్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కందిరీగ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రాబోతున్న మూవీలో హీరోయిన్ గా నటించనుంది నభా

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా లైనప్ పూర్తిగా మారిపోయింది. ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే రవితేజ సరసన డిస్కోరాజా సినిమాను పూర్తిచేసిన నభా.. ప్రస్తుతం సాయితేజ్ హీరోగా ఓ సినిమా చేస్తోంది. ఇప్పుడు బెల్లంకొండ మూవీ కూడా లాక్ చేసింది. రేపు ఈ సినిమా గ్రాండ్ గా లాంఛ్ అవుతుంది.

నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ బ్యూటీ, ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే పెట్టింది. వరుసగా తెలుగు నుంచే ఆఫర్లు వస్తుండడంతో, కన్నడ సినిమాలు పూర్తిగా తగ్గించేసింది.