విజయ్ దేవరకొండ మారింది ఒక్క విషయంలోనే...

Friday,November 29,2019 - 09:02 by Z_CLU

విజయ్ దేవరకొండ చాలా మారిపోయాడు. గతంలోలా సైమల్టేనియస్ గా సినిమాలుచెయ్యట్లేదు. ఓ సినిమా రిలీజయితే కానీ ఇంకో సినిమాని సెట్స్ పైకి తీసుకురావడం లేదు. అయితే ఈ హీరో మారింది ఈ ఒక్క  విషయంలోనే. జస్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకురావడం లేదంతే.. కానీ సినిమాలను లైనప్ చేసుకునే విషయంలో మాత్రం ఏ మాత్రం స్పీడ్ తగ్గించట్లేదు.

రీసెంట్ గా ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అలాగని ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తరవాత ఇమ్మీడియట్ గా ఈ సినిమా చేసేయడు. వరసగా లైనప్ చేసుకున్న సినిమాల్లో ఈ సినిమా కూడా చేరిందంతే… ఈ సినిమా కన్నా ముందు సెట్స్ రావాల్సిన సినిమాలు ఇంకా ఉన్నాయి.

పూరి జగన్నాథ్ తో ‘ఫైటర్’ సినిమా చేస్తాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించబోతున్నాడు. పూరి గురించి తెలియనిదేముంది…? ఓ సారి సినిమాని సెట్స్ పైకి తీసుకు వచ్చాడంటే పెద్దగా టైమ్ తీసుకోడు.. అయితే విజయ్ ఈ సినిమాతో పాటు ఇంకో సినిమాని ఫిక్సయి ఉన్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ తో ‘హీరో’ సినిమాకి సంతకం చేశాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. పూరి సినిమా తరవాత ఈ సినిమా చేస్తాడా..? లేకపోతే ఈ సినిమా తర్వాతే పూరితో సినిమా చేస్తాడా..? చెప్పలేం.. ఈ ప్లానింగ్ ఎలా ఉన్నా ఈ సినిమాలు చేసే లోపు ఇదే స్పీడ్ లో మరిన్ని సినిమాలు ఫిక్స్ అవ్వనున్నాడు విజయ్ దేవరకొండ.