Vijay Deverakonda Shiva Nirvana Movie - పక్కా కామెడీ ఎంటర్ టైనర్

Monday,September 06,2021 - 07:51 by Z_CLU

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘లైగర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మూడు నాలుగు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు రౌడీ. అందులో సుకుమార్ సినిమా ఒకటి కాగా మరొకటి శివ నిర్వాణ సినిమా. మజిలీ రిలీజ్ అయిన వెంటనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా లాక్ అయింది. ఈ కాంబో సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ కూడా చేశారు.

తాజాగా ఈ సినిమా గురించి అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు. ‘టక్ జగదీష్’ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన శివ నిర్వాణ విజయ్ దేవరకొండతో నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఈసారి ఎమోషనల్ కంటెంట్ తో కాకుండా ఫుల్లెంత్ కామెడీ సినిమా చేస్తానని చెప్పాడు. డైరెక్ట్ చేసిన మూడు సినిమాలతో ఎమోషనల్ డైరెక్టర్ అనే ముద్ర పడిందని… అది ఈ సినిమాతో పోతుందని చెప్పుకున్నాడు.

కరోన పరిస్థితులు చూశాక ప్రేక్షకులకు థియేటర్స్ లో మంచి ఎంటర్టైన్ మెంట్ అందించాలని డిసైడ్ అయ్యానని అందుకే ఈసారి మంచి ఫన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేసుకున్నానని తెలిపాడు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో చేయబోతున్నట్లు కూడా చెప్పాడు. త్వరలోనే ఈ కాంబో సినిమాను ప్రకటించనున్నారు. ప్రస్తుతం విజయ్ పూరి సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ సినిమాకు సంబంధించి ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అది పూర్తి చేసి శివ నిర్వాణ సినిమాను సెట్స్ పై పెట్టె ఆలోచనలో ఉన్నాడు విజయ్. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తాడు. ఈ లోపు సుకుమార్ పుష్ప రెండు భాగాలు పూర్తి చేస్తాడు.