మామ్ ట్రయిలర్ రిలీజ్

Saturday,June 03,2017 - 05:02 by Z_CLU

దాదాపు 5 సంవ‌త్స‌రాల గ్యాప్ త‌రువాత  వెట‌ర‌న్ యాక్ట‌రెస్ శ్రీ‌దేవి మామ్ చిత్రంతో ఆడియ‌న్స్ ను అల‌రించ‌డానికి సిద్దం అయ్య‌ారు.  ఇప్పటికే ఫస్ట్ లుక్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ మూవీకు సంబంధించి తాజాగా ట్రయిలర్ లాంచ్ చేశారు. ట్రయిలర్ కూడా ఇలా విడుదలైన వెంటనే వైరల్ అయింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ ఇదే.

రెండు నిముషాల 5 సెక‌న్లు వున్న  ఈ ట్రైల‌ర్ లో  సినిమాలో  అతి ముఖ్య‌మైన  సంఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన షాట్స్  ను  పొందుప‌రిచారు.  ఎన్నో భావోద్వేగాల‌తో ఈ చిత్రం ఉండబోతోందనే విషయం అర్దం అవుతుంది.  తన టీనేజ్ కూతురిపై జ‌రిగిన  అమానుషానికి వ్య‌తిరేకంగా  త‌ల్లి చేసిన పోరాట‌మే  మామ్ చిత్ర క‌థ  అన్న‌ట్లుగా  ట్రైల‌ర్ చూస్తే అర్ధం అవుతుంది. మొత్తం మీద ట్రైల‌ర్ తో   పాజిటివ్  టాక్ గెయిన్ చేశారు.

ర‌వి ఉద్వార్ అనే ద‌ర్శ‌కుడి తో  మామ్ చిత్రం చేశారు శ్రీదేవి. సినిమాలో ఆమె పాత్ర పేరు దేవకి. ఈ  చిత్రంలో  అక్ష‌య్ ఖ‌న్నా ఒక కీ రోల్ చేయ‌గా పాకిస్తాన్ కు చెందిన మ‌రో ఇద్ద‌రు న‌టులు కూడా  యాక్ట్ చేశారు. ఈ చిత్రం  ప్ర‌పంచవ్యాప్తంగా  ఈ నెల 7 న రిలీజ్ అవుతున్న విష‌యం తెలిసిందే. హిందీతో పాటు..తెలుగు, త‌మిళ్  భాష‌ల్లో  కూడ రిలీజ్ చేస్తున్నారు. శ్రీ‌దేవి భ‌ర్త బోనీ క‌పూర్ మామ్ చిత్రిన్ని నిర్మించారు.