Thalapathy66 రిలీజ్ డేట్ లాక్

Tuesday,May 10,2022 - 06:14 by Z_CLU

Vijay’s #Thalapathy66 Release date locked

దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న #Thalapathy66 సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్సయింది. 2023 సంక్రాంతి స్పెషల్ గా మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఎనౌన్స్ చేశారు.

నేషనల్ క్రష్ రష్మికా మందన్న, విజయ్ సరసన హీరోయిన్ గా  నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భారీతారాగణం కనువిందు చేయనుంది.  కీలక పాత్రలలో సీనియర్ స్టార్లు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ,  కనిపించనున్నారు. వీరితో పాటు.. శామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ఇతర కీలక పాత్రలలో సందడి చేయనున్నారు.

సూపర్ ఫామ్‌లో ఉన్న సెన్సేషనల్ సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. వంశీ పైడిపల్లితో పాటు హరి,అహిషోర్‌ సాల్మన్‌ కథ, స్క్రీన్ ప్లేను, కార్తీక్ పళని ఛాయాగ్రాహకుడిగా, కెఎల్ ప్రవీణ్ ఎడిటర్ గా, శ్రీ హర్షిత్ రెడ్డి, శ్రీ హన్షిత సహ నిర్మాతలుగా, సునీల్ బాబు, వైష్ణవి రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్లుగా ఈ చిత్రానికి పని చేస్తున్నారు.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics