పని కంప్లీట్ చేసుకున్న ‘దేవదాస్’

Wednesday,September 12,2018 - 11:01 by Z_CLU

నాగార్జున, నాని కాంబినేషన్ లో వస్తున్న ‘దేవదాస్’ సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సెప్టెంబర్ 27 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్న ఈ సినిమా యూనిట్, ఇక నుండి ఫుల్ టైమ్ ఫోకస్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పై పెట్టనుంది.

ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, సాంగ్స్ సినిమా సక్సెస్ కి కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా నాని, నాగార్జున కాంబినేషన్ లో ఉండబోయే సీన్స్ పై ఫ్యాన్స్ లో భారీ క్యూరియాసిటీ క్రియేట్ అయి ఉంది.

శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ కి మణిశర్మ మ్యూజిక్ కంపోజర్. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాని అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. ఆకాంక్ష సింగ్, రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్స్.