నాగచైతన్య కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందా?

Wednesday,September 12,2018 - 12:47 by Z_CLU

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సినిమాల్లో శైలజారెడ్డి అల్లుడు మూవీపై ఉన్నంత క్రేజ్, బజ్ మరే సినిమాపై లేదు. గీతగోవిందం తర్వాత ఆ స్థాయిలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది ఈ మూవీ. ఇంకా చెప్పాలంటే, నాగచైతన్య ఇప్పటివరకు చేసిన ఏ సినిమాకు ఇంత స్కోప్ రాలేదు. మరి ఇంత బజ్ క్రియేట్ చేసిన శైలజారెడ్డి అల్లుడు సినిమా చైతూ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా..?

మారుతి-చైతూ కాంబోలో వచ్చిన ఈ సినిమా అటుఇటుగా 25 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఖర్చులతో కలుపుకొని కనీసం 28 కోట్ల రూపాయలైనా రాబట్టాలి. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న గ్యాప్ చూస్తే ఇది సాధ్యమే అనిపిస్తోంది.

పైగా నాగచైతన్య నటించిన ఓ సినిమాకు హిట్ టాక్ వస్తే, అది ఏ రేంజ్ లో కలెక్ట్ చేస్తుందని విషయం రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో ప్రూవ్ అయింది. గతేడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా వచ్చిన ఆ సినిమా భారీ కాంపిటిషన్ మధ్య కూడా బ్రహ్మాడంగా ఆడింది.

సో.. శైలజారెడ్డి అల్లుడు సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, ప్రస్తుతం ఉన్న గ్యాప్ ను క్యాష్ చేసుకొని కనీసం 30 కోట్లు రాబట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ ఎక్స్ పెక్ట్ చేస్తోంది. దీనికి వినాయక చవితి వీకెండ్ కూడా తోడైతే, చైతూ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా శైలజారెడ్డి అల్లుడు నిలవడం గ్యారెంటీ.