Rashmika రెయిన్‌బో షూటింగ్ అప్డేట్

Monday,July 17,2023 - 12:14 by Z_CLU

Rashmika’s Rainbow Shooting updates

రష్మిక మందన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తెలుగు తమిళ ద్విభాషా రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘రెయిన్‌బో. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రంలో దేవ్ మోహన్ మరో ప్రధాన పాత్ర పోహిస్తున్నారు. నూతన దర్శకుడు శాంతరూబన్‌  దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి తొలి షెడ్యూల్  పూర్తి చేసుకుంది. కోడైకెనాల్ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కీలక సీన్స్ ను ఘాట్ చేసుకున్నారు. ఇప్పుడు ‘రెయిన్‌బో’ సెకండ్ షెడ్యూల్ కి సిద్ధమౌతోంది. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమౌతుంది.

జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. భాస్కరన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు. ఇ. సంగతమిళన్ ఎడిటర్.