50 రోజులు పూర్తి చేసుకున్న ‘గీతగోవిందం’

Wednesday,October 03,2018 - 11:29 by Z_CLU

గీత గోవిందం రిలీజై ఇవాళ్టికి సరిగ్గా 50 రోజులు. ఆగష్టు 15 న రిలీజైన ఈ సినిమా 1 కాదు 2 కాదు ఏకంగా 59 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుందంటే ఈ సినిమా  క్రియేట్ చేసిన మ్యాజిక్ ఏ రేంజ్ లో రీచ్ అయిందో అర్థమవుతుంది. విజయ్ దేవరకొండ కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది గీతగోవిందం.

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ కి దగ్గరైన విజయ్ దేవరకొండని, ఫ్యామిలీస్ కి కూడా రీచ్ అయ్యేలా చేసింది గీత గోవిందం సినిమా. స్పెషల్ గా ఈ సినిమాలోని, విజయ్, రష్మిక క్యారెక్టర్స్ కి ఆడియెన్స్, ఈజీగా కనెక్ట్ అవ్వడంతో  సినిమా ఫస్ట్ వీకెండ్ కే సక్సెస్ ట్రాక్ పై ఎక్కేసింది.

మరీ ముఖ్యంగా ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే…’  సాంగ్ క్రియేట్ చేసిన పాజిటివ్ బజ్, సినిమా రిలీజ్ తరవాత కూడా అంతే స్ట్రాంగ్ గా కంటిన్యూ అయింది. దానికి తోడు గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, విజయ్ దేవరకొండ, రష్మిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ సినిమాని బ్లాక్ బస్టర్ రేంజ్ లో నిలబెట్టాయి. ఈ సినిమా పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్.