రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న 'అరవింద'

Wednesday,October 03,2018 - 11:28 by Z_CLU

నిన్న రాత్రి సరిగ్గా 8 గంటల 10 నిమిషాలకు విడుదలైన అరవింద సమేత థియేట్రికల్ ట్రయిలర్, రిలీజైన నెక్ట్స్ సెకెండ్ నుంచి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉంది. గంటగంటకు ఈ ట్రయిలర్ వ్యూస్, లైక్స్ లెక్కలేనంతగా పెరిగిపోతున్నాయి. అలా రిలీజైన 12 గంటల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాధించింది అరవింద సమేత థియేట్రికల్ ట్రయిలర్.

యూట్యూబ్ తో పాటు మిగతా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ తో కలిపి ఇలా 50 లక్షల వ్యూస్ తెచ్చుకుంది ఈ ట్రయిలర్. ఇందులో 2 లక్షల 75వేలకు పైగా లైక్స్ కూడా ఉన్నాయి. యంగ్ టైగర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కు ఇది నిదర్శనం.

ట్రయిలర్ లో ఎన్టీఆర్ ఎనర్జీ, యాక్షన్, లుక్స్ అన్నీ అదిరిపోయాయి. ఇక పూజా హెగ్డే సొంత డబ్బింగ్, జగపతిబాబు విలనీ లుక్, సునీల్ ఎప్పీయరెన్స్ ట్రయిలర్ లో అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. దసరా కానుకగా 11న అరవిందతో కలిసి థియేటర్లలోకి వస్తున్నాడు వీరరాఘవ.