వీకెండ్ రిలీజెస్

Wednesday,October 03,2018 - 12:49 by Z_CLU

లాస్ట్ వీక్ రిలీజైన దేవదాస్, నవాబ్ రెండూ డిఫెరెంట్ జోనర్ సినిమాలే. ఒకే రోజు రిలీజైన ఈ 2 సినిమాల క్రేజ్ ఇంకా తగ్గనే లేదు అప్పుడే నెక్స్ట్ వీకెండ్, బాక్సాఫీస్ దగ్గర పోటీ పడటానికి కొత్త సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. వాటి వివరాలు…

నోటా :  విజయ్ దేవరకొండ హీరోగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అగ్రెసివ్ చీఫ్ మినిస్టర్ లా కనిపించనున్నాడు. ఆనంద్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మెహరీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా అక్టోబర్ 5 న రిలీజవుతుంది.

దేశంలో దొంగలు పడ్డారు : ఖయ్యూం, తనిష్క్, పృథ్వీరాజ్  నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. రియలిస్టిక్ ఎలిమెంట్స్ తో హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి గౌతమ్ దర్శకుడు. ఈ సినిమాని ఆలీ సమర్పిస్తున్నాడు. అక్టోబర్ 4 న రిలీజవుతుందీ సినిమా.

భలే మంచి చౌక బేరం : మారుతి మార్క్ తో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఇది. నవీద్, పార్వతీశం, యామినీ భాస్కర్, రాజా రవీంద్ర కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమా ఈ నెల 5 న థియేటర్స్ లోకి వస్తుంది. మురళీకృష్ణ ముడిదాని ఈ సినిమాకి డైరెక్టర్. ఇప్పటికే ట్రైలర్స్ ఆడియెన్స్ లో క్రేజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో ఎట్రాక్ట్ చేస్తుందో చూడాలి.