ఈనెల 18 నుంచి వెంకీ-తేజ సినిమా

Tuesday,February 13,2018 - 11:01 by Z_CLU

విక్టరీ వెంకటేశ్, దర్శకుడు తేజ కాంబినేషన్ లో రానున్న కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 18 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. అయితే వెంకీ మాత్రం వెంటనే జాయిన్ కాడు. మార్చి మొదటి వారంలో వెంకీ సెట్స్ పైకి వెళ్తాడు.

లెక్కప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ పాటికి స్టార్ట్ కావాల్సింది. కానీ సినిమాలో కొత్త నటీనటుల్ని తీసుకోవాలనే ఉద్దేశంతో కాస్టింగ్ కాల్ ఇచ్చాడు తేజ. ఈమధ్యే ఆడిషన్స్ నిర్వహించి కొందరు నటీనటుల్ని ఎంపిక చేశాడు. వాళ్లతో ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వెంకీ జాయిన్ అవుతాడు.

ఈ మూవీకి “ఆట నాదే-వేట నాదే” అనే టైటిల్ అనుకుంటున్నారు. త్వరలోనే టైటిల్ తో పాటు మూవీలో వెంకీ సరసన నటించనున్న హీరోయిన్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. అనూప్ రూబెన్స్ ఈ మూవీకి సంగీత దర్శకుడు.