మరి కొన్ని గంటల్లో 'రంగస్థలం' మొదటి పాట

Tuesday,February 13,2018 - 12:01 by Z_CLU

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘రంగస్థలం’ మొదటి పాట మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన రామ్ చరణ్, సమంత  టీజర్స్  సినిమాపై భారీ   హైప్ తీసుకురావడంతో ఇప్పుడు అదే ఉత్సాహంతో ఈ సినిమాలోని మొదటి పాటను శివరాత్రి కానుకగా సాయత్రం 5 గంటలకు సోషల్ మీడియాలో విడుదల చేస్తున్నారు.

‘ఎంత సక్కగున్నావే ‘ అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయమని చెప్తుంది యూనిట్. దేవి శ్రీ సంగీతానికి చంద్రబోస్ అందించిన లిరిక్స్ సాంగ్ కి స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు. ఈ పాట విడుదలైన వెంటనే మినిమం గ్యాప్ లో ఆల్బంలోని మిగతా పాటలను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చ్ 30న థియేటర్స్ లోకి రానుంది.