

Friday,March 31,2023 - 04:02 by Z_CLU
ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పటికి, నిర్మాతలు సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. సైంధవ్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. డిసెంబరు 25న (క్రిస్మస్) మొదటి సోమవారం సెలవుదినం కాబట్టి, సినిమా లాంగ్ వీకెండ్‌ని ఎంజాయ్ చేయనుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో వెంకటేష్ చేతిలో మెషిన్ గన్ పట్టుకుని కంటైనర్ పైన కూర్చోవడం కనిపిస్తుంది. కంటైనర్‌లో కొన్ని పేలుడు పదార్థాలను గమనించవచ్చు. పోస్టర్‌లో వెంకటేష్ సీరియస్ గా కనిపిస్తున్నారు.
మేకర్స్ ఇదివరకే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ , గ్లింప్స్ లో వెంకటేష్ ఇంటెన్స్ అవతారంలో కనిపించారు. సైంధవి భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందుతోంది. వెంకటేష్ కెరీర్లో ఇది అత్యంత కాస్ట్లీ మూవీ. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రముఖ సాంకేతిక ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది