ప్రెస్టీజియస్ మూవీ పై సస్పెన్స్ ..

Sunday,March 26,2017 - 07:21 by Z_CLU

త్వరలో ‘గురు’ సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న విక్టరీ వెంకటేష్ ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా..అనే క్యూరియాసిటీ రోజు రోజు కి పెరుగుతుంది.. దీనికి కారణం వెంకీ నెక్స్ట్ సినిమా 75 వ ప్రెస్టీజియస్ మూవీ కావడమే..

ఇక ‘గురు’ రిలీజ్ అయిన వెంటనే నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేస్తాడనుకున్న అభిమానులకు కాస్త షాక్ ఇచ్చాడు వెంకీ. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో నెక్స్ట్ సినిమా పై స్పందించిన వెంకటేష్ ” 75 సినిమాకు ఇంకా టైం ఉందని ప్రస్తుతం క్రిష్ ఓ నవల ఆధారంగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని దాంతో పాటు పూరి కూడా ఓ కథ రాస్తున్నాడని అలాగే కిశోర్ తిరుమల తో కూడా ఓ సినిమా చేస్తానని కానీ అంతకంటే ముందు ‘గురు’ రిలీజ్ తరువాత ఫామిలీ తో ఓ టూర్ ప్లాన్ ఉందని  ఆ టూర్ నుంచి తిరిగొచ్చాకే నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తానని” తెలిపాడు..

ప్రస్తుతం కిశోర్ తిరుమల రామ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతుండడంతో వెంకీ తన 75వ సినిమాకి క్రిష్ లేదా పూరి కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. మరి వీరిద్దరిలో వెంకీ ప్రెస్టీజియస్ మూవీ ను డైరెక్ట్ చేసే దర్శకుడెవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే..