సెట్స్ పైకెళ్లేందుకు రెడీ

Sunday,March 26,2017 - 08:10 by Z_CLU

‘హైపర్’ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎట్టకేలకి తన నెక్స్ట్ సినిమాను సెట్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు కిశోర్ తిరుమల ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేయడంతో మార్చ్ 29న  పూజ కార్యక్రమాలతో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు రామ్..


‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ సినిమా తరువాత రామ్ – కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా తో డిఫరెంట్ లుక్ సిక్స్ ప్యాక్ బాడీ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాడు రామ్.    అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ హీరోయిన్స్ గా నటించనున్న ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.