తొలిప్రేమ 3 రోజుల వసూళ్లు

Tuesday,February 13,2018 - 07:34 by Z_CLU

హీరో వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. రోజురోజుకు ఈ సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. వర్కింగ్ డే అయిన సోమవారం కూడా ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్లు రావడం విశేషం. విడుదలైన ఈ 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 8 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు ఓవర్సీస్ లో ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ దాటేసిన ఈ సినిమా.. ఈ వీకెండ్ నాటికి బ్రేక్ ఈవెన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

ఏపీ, నైజాం 3 రోజుల వసూళ్లు

నైజాం – రూ. 3.05 కోట్లు

సీడెడ్ – రూ. 1 కోటి

నెల్లూరు – రూ. 0.28 కోట్లు

గుంటూరు – రూ. 0.76 కోట్లు

కృష్ణా – రూ. 0.66 కోట్లు

వెస్ట్ – రూ. 0.55 కోట్లు

ఈస్ట్ – రూ. 0.64 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 1.16 కోట్లు

3 రోజుల మొత్తం షేర్ – రూ. 8.10 కోట్లు