B.V.S.N. ప్రసాద్ ఇంటర్వ్యూ

Tuesday,February 13,2018 - 06:34 by Z_CLU

వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సూపర్ హిట్టయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న ఆయన మీడియాతో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అవి మీ కోసం…

నా తొలిప్రేమ అనుభూతులు… 

నా తొలిప్రేమ నా వైఫే… పెద్దలు కుదిర్చిన పెళ్ళి… ఇప్పట్లోలా కాదు, పెద్దవాళ్ళు చేసుకొమ్మన్నారు.. చేసుకున్నారంతే…

సక్సెస్ క్రెడిట్ అతనికే…

కథ నాకన్నా ముందు మా అబ్బాయి బాపి విన్నాడు. దిల్ రాజు గారి దగ్గర కథ తయారైంది. సెకండాఫ్ ఏదో వర్కవుట్ అవ్వట్లేదు అని దిల్ రాజు గారు తప్పుకున్నారు. మా అబ్బాయి కథ వినడం ఆ తరవాత డైరెక్టర్ కథ కంప్లీట్ చేసుకోవడంతో,  వరుణ్ తేజ్ ఈ కథను… డైరెక్టర్ ను నమ్మడం వల్లే సినిమా సెట్స్ పైకి వచ్చింది. వరుణ్ తేజ్ ‘ఫిదా’ లాంటి సక్సెస్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ తరవాత మళ్ళీ లవ్ స్టోరీని ప్రిఫర్ చేయడం సాహసమే…

దిల్ రాజు గారు ఇంప్రెస్ అయ్యారు….

కథ ఆయన దగ్గరే బిగిన్ అయింది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ దిల్ రాజు గారు తీసుకున్నారు. సెకండాఫ్ రెడీ అయ్యాక ఆయన కూడా ఇంప్రెస్ అయ్యారు.. వరుణ్ తేజ్ కి సక్సెస్ రాసిపెట్టి ఉంది కాబట్టే సినిమా సక్సెస్ అయింది…

డిలీటెడ్ సీన్స్….

మామూలుగా మా బ్యానర్ లో హిట్టయిన సినిమాల డిలీటెడ్ సీన్స్ తర్వాత ఆడ్ చేస్తుంటాం. కానీ ఈ సినిమాలో డిలీటెడ్ సీన్స్ లేవు. డైరెక్టర్ పర్ఫెక్ట్ గా రాసుకున్నది రాసుకున్నట్టుగా తీశాడు.

ఇది నాకు అలవాటు లేని పని…

నిజం చెప్పాలంటే నేను కొత్త డైరెక్టర్ తో సినిమా చేయను. బాపి అనుకున్నాడు కాబట్టే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. మళ్ళీ మా బ్యానర్ లో కొత్త డైరెక్టర్ సినిమా రావాలంటే మా అబ్బాయి బాపినీడు చూసుకుంటాడు. ఈ సినిమాకు కూడా నేను పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు. ఒక్క మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చున్నాను అంతవరకే…

పెద్ద స్టార్ తో సినిమా….

పెద్ద స్టార్ తో సినిమా చేయాలంటే ఇప్పుడు అందరూ బిజీగానే ఉన్నారు. ఇక మల్టీస్టారర్ సినిమా విషయానికి వస్తే మల్టీస్టారర్ తీయగలిగే కెపాసిటీ డైరెక్టర్ కి ఉండాలి. రాజమౌళికి ఆ కెపాసిటీ ఉంది.

కథను బట్టే బడ్జెట్…

కథను సిన్సియర్ గా తీయాలి. కథకు ఎంత అవసరమో అంత పెట్టాలి అప్పుడే సినిమా బావుంటుంది. లేకపోతే అంత కష్టం వృధా అయిపోతుంది.

దిల్ రాజుగారు వదిలేసిన సినిమా…

సెకండాఫ్ కుదరలేదని దిల్ రాజు గారి లాంటి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ వదిలేసిన సినిమాని వరుణ్ తేజ్ నమ్మాడు. తను ఒప్పుకోకపోతే అసలీ సినిమా ఉండేది కాదు. అందుకే ఈ సక్సెస్ క్రెడిట్ వరుణ్ తేజ్ కే దక్కుతుంది.

చేసుకుంటూ పోవడమే…

ఈ సినిమాతో 24 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 25 వ సినిమా అని స్పెషల్ ఫీలింగ్ ఏమీ లేదు. వరసగా చేసుకుంటూ పోవడమే.

ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవ్వాలి…

కాంబినేషన్ ని బట్టి సినిమా అనుకున్నా కథ ఉండాల్సిందే కదా…. కథ ఉంటేనే ఏదైనా వర్కవుట్ అవుతుంది. ప్రొడ్యూసర్ కూడా ఆ కథలో ఇన్వాల్వ్ అయినప్పుడే బడ్జెట్ క్లారిటీ ఉంటుంది.

ఛత్రపతికి సీక్వెల్..?

హిట్టయిన సినిమాలకు సీక్వెల్ లాంటివి ఏమీ అనుకోలేదు కానీ అనుకోకుండా ఏమైనా ఉంటే చేయవచ్చు. ఆర్య 2 కూడా అప్పటికప్పుడు అనుకుని చేసిందే. నిజానికి ఆ స్థానంలో వేరే కథ అనుకున్నాం. కానీ బన్ని ఆర్య 2 చేసేద్దాం అనగానే అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది….

 

మహేష్ బాబుతో త్వరలో….

ఇండస్ట్రీలో మ్యాగ్జిమం అందరు పెద్ద డైరెక్టర్స్ తో సినిమా చేశాను.. అందరూ పెద్ద స్టార్స్ తో కూడా చేశాను ఒక మహేష్ బాబుతో తప్ప. ఆయనతో కూడా త్వరలో ప్లాన్ చేస్తాను.

ప్రతీది ఇంపార్టెంటే…

ఈ రోజు సాంగ్స్ బావున్నాయి అని అందరూ అంటున్నారంటే ప్రతీది బావుంది కాబట్టే సాంగ్స్ నచ్చుతున్నాయి. తమన్ మంచి ట్యూన్స్  ఇచ్చినా, లిరిక్స్ కుదరాలి. డైరెక్టర్ మంచి సిచ్యువేషన్ ఇవ్వాలి… ఎవరి పని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారు కాబట్టే కుదిరింది…

అడగ్గానే ఇచ్చారు…

సినిమాకి  ‘తొలిప్రేమ’ అనే టైటిల్ పర్ఫెక్ట్. వేరే ఏ టైటిల్ పెట్టినా తేలిపోయి ఉండేది. మేం అనుకున్న టైమ్ కి ఆల్ రెడీ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. వెళ్లి అడగ్గానే ఇచ్చేశారు. అలా జరిగింది.