మిలియన్ మార్క్ అందుకున్న తొలిప్రేమ

Saturday,February 24,2018 - 01:56 by Z_CLU

వరుణ్ తేజ్, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తొలిప్రేమ సినిమా ఓవర్సీస్ లో మరో ఘనత సాధించింది. ఈ సినిమాకు అక్కడ 10 లక్షల డాలర్లు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన హీరోగా వరుణ్ తేజ్ రికార్డు సృష్టించాడు. రీసెంట్ గా ఈ హీరో నటించిన ఫిదా సినిమా కూడా మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరింది.

మరోవైపు తన తొలి సినిమాతోనే ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరిన దర్శకుడిగా వెంకీ అట్లూరి రికార్డు సృష్టించాడు. ఈ క్లబ్ లో చాలా తక్కువమంది దర్శకులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు