తొలిప్రేమ క్లోజింగ్ కలెక్షన్లు

Thursday,March 15,2018 - 06:02 by Z_CLU

వరుణ్ తేజ్, రాశి ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తొలిప్రేమ సినిమా థియేట్రికల్ రన్ పూర్తిచేసుకుంది. విడుదలైన మొదటి రోజు నుంచి నాన్ స్టాప్ గా 3 వారాలు ఆడిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 18 కోట్ల 74 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఆమధ్య థియేటర్ల బంద్ కారణంగా  ఈ సినిమాకు కాస్త కలెక్షన్లు తగ్గినప్పటికీ.. ఓవరాల్ గా అటు టాక్ పరంగా, ఇటు వసూళ్ల పరంగా తొలిప్రేమ హిట్ మూవీ అనిపించుకుంది.

ఏపీ, నైజాం ఫైనల్ కలెక్షన్లు

నైజాం – రూ. 7.05 కోట్లు

సీడెడ్ – రూ. 2.25 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ. 3.01 కోట్లు

గుంటూరు – రూ. 1.43 కోట్లు

ఈస్ట్ – రూ. 1.65 కోట్లు

వెస్ట్ – రూ. 1.25 కోట్లు

కృష్ణా – రూ. 1.50 కోట్లు

నెల్లూరు – రూ. 0.60 కోట్లు

మొత్తం షేర్ – రూ. 18.74 కోట్లు