తొలిప్రేమ టీమ్ ని అభినందించిన మెగాస్టార్

Friday,February 16,2018 - 03:20 by Z_CLU

వరుణ్ తేజ్ తొలిప్రేమ సెకండ్ వీక్ సక్సెస్ ఫుల్ గా ప్రదర్శించబడుతుంది. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, యూత్ తో పాటు ఫ్యామిలీస్ ని కూడా అదే రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తుంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ‘తొలిప్రేమ’ టీమ్ ని అభినందించారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ… “పవన్ ‘తొలిప్రేమ’ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాపై బిగినింగ్ నుండే క్యూరాసిటీ రేజ్ అయింది. కాకపోతే నేను కాస్త ఆలస్యంగా చూశాను. చాలా ఇన్స్ పైరింగ్ గా ఉంది మూవీ. క‌థ క‌న్నా సిచ్యువేషనల్ గానే సినిమా అంతా  ఉంటుంది.  ఇలా సినిమా చేయ‌డం డైరెక్ట‌ర్ కి చాలా పెద్ద  ఛాలెంజిగ్. సినిమా  ఇంత ప్రెష్ గా ఉందంటే కంప్లీట్ క్రెడిట్ డైరెక్టర్ కే దక్కుతుంది. సినిమాని ఒక కొత్త యాంగిల్ లో ప్రెజెంట్ చేశారు. ఇలాంటి  డైరెక్ట‌ర్స్ ఇండస్ర్టీకి రావాలి.” అని చెప్పుకున్నారు.

 

B.V.S.N. ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన రాశిఖన్నా నటించింది. తమన్ మ్యూజిక్ కంపోజర్.