వరుణ్ తేజ్ సినిమా పేరు "తొలిప్రేమ"

Monday,December 04,2017 - 04:01 by Z_CLU

అంతా ఊహించినట్టే జరిగింది. చాన్నాళ్లుగా వార్తల్లో నలుగుతున్న తొలిప్రేమ అనే టైటిల్ నే వరుణ్ తేజ్ కొత్త సినిమాకు ఫిక్స్ చేశారు. ఈరోజు సరిగ్గా 4 గంటలకు ఈ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

పవన్ కల్యాణ్ కెరీర్ లోనే దిబెస్ట్ & వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచింది తొలిప్రేమ. అలాంటి టైటిల్ ను ఇప్పుడు మరోసారి తెరపైకి తీసుకురావడంతో వరుణ్ తేజ్ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఈ హీరో తాజాగా నటించిన ఫిదా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. అప్ కమింగ్ ప్రాజెక్టుపై మంచి బజ్ క్రియేట్ అయింది.

ఈ సినిమాతో వెంకీ అట్లూరి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 9న తొలిప్రేమ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మరోసారి ప్రకటించారు మేకర్స్.