మరో రీమేక్ లో తమన్నా

Monday,December 04,2017 - 03:28 by Z_CLU

ప్రస్తుతం ‘క్వీన్’ తెలుగు రీమేక్ తో బిజీ బిజీగా ఉంది మిల్కీబ్యూటీ తమన్నా. అయితే ఈ గ్యాప్ లో మరో సెన్సేషన్ సూపర్ హిట్ సినిమా రీమేక్ కి సంతకం చేసింది. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ మూవీ ‘జిగర్తండ’ సినిమా, హిందీ రీమేక్ లో ఫర్హాన్ అఖ్తర్ సరసన నటించనుంది తమన్నా.

 

సిద్ధార్థ్, లక్ష్మీ మీనన్ జంటగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కి 2014 లో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు హిందీలో రీమేక్ కానుంది. ఈ సినిమాలో లక్ష్మీ మీనన్ ప్లే చేసిన క్యారక్టర్ లో హిందీలో తమన్నా నటించనుంది. సౌత్ ఇండియన్ సినిమాల్లో బిజీగా ఉంటూనే, అడపాదడపా హిందీ సినిమాలకు సంతకం చేస్తూ బాలీవుడ్ లో కూడా బిజీ స్టార్ అనిపించుకుంటుంది తమన్నా.