ఫస్ట్ లుక్ తో రెడీ అవుతున్న వరుణ్ తేజ్

Friday,May 25,2018 - 04:35 by Z_CLU

సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఓ స్పేస్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్.  ఆస్ట్రోనాట్ గా నటిస్తున్న ఈ  మూవీ  ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. టైటిల్ తో పాటు వరుణ్ తేజ్ లుక్ కూడా ఈ ఒకేసారి రిలీజ్ చేస్తారని టాక్.

వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నాడు వరుణ్ తేజ్. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో పాటు కళ్లుచెదిరే విజువల్స్ ఎఫెక్ట్స్ తో రాబోతోంది ఈ సినిమా.

భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు, క్రిష్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.