గోవాలో హీట్ పెంచుతున్న ‘నా పేరు సూర్య’

Monday,December 04,2017 - 05:03 by Z_CLU

అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ హెవీ యాక్షన్ ఎంటర్ టైనర్  ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా ఊటీలో భారీ షెడ్యూల్ కి ప్యాకప్ చెప్పి, నవంబర్ 30 నుండి గోవా షెడ్యూల్ ని బిగిన్ చేసిన సినిమా యూనిట్, సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించింది. అయితే ఈ షెడ్యూల్ లో ఇవాళ్టి నుండి అనూ ఇమ్మాన్యువెల్ జాయిన్ అయినట్టు తెలుస్తుంది.

నిన్నటి వరకు గోవాలోని ఎగ్జోటిక్ లొకేషన్ లో సినిమాలోని ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కించిన సినిమా యూనిట్, ఇవాళ్టి నుండి అనూ ఇమ్మాన్యువెల్, బన్ని కాంబినేషన్ లో రొమాంటిక్ సీన్స్ తెరకెక్కిస్తుంది.  లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విశాల్ & శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ క్రూషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఏప్రియల్ 27, 2018 న రిలీజ్ కానుంది.