మరో కథకు ఓకే చెప్పిన వరుణ్ తేజ్

Tuesday,March 06,2018 - 12:09 by Z_CLU

సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ డిఫరెంట్ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఇప్పుడీ మూవీతో పాటు మరో సినిమా చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడు. దర్శకుడు సాగర్ చంద్ర చెప్పిన స్టోరీలైన్, బాగా నచ్చడంతో ఆ మూవీని కూడా ఓకే చేశాడు వరుణ్.

14 రీల్స్ బ్యానర్ పై గోపీచంద్ ఆచంట నిర్మాతగా సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ మూవీ చేయబోతున్నాడు. ప్రాజెక్టుకు సంబంధించి స్టోరీ డిస్కషన్లు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సినిమాను ఆఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు. గతంలో అయ్యారే, అప్పట్లో ఒకడుంటేవాడు లాంటి విభిన్నమైన చిత్రాల్ని తెరకెక్కించాడు సాగర్ చంద్ర.

ఫిదా, తొలిప్రేమ రూపంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ వచ్చినప్పటికీ తన ప్రయోగాలు ఆపట్లేదు వరుణ్ తేజ్. కథకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. నిజానికి ఈ రెండు విజయాల తర్వాత మరో కమర్షియల్ మూవీ చేసుకోవచ్చు. కానీ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో స్పేస్ కాన్సెప్ట్ మూవీకి ఓకే చేశాడు. ఇప్పుడు సాగర్ చంద్ర దర్శకత్వంలో మరో ఢిఫరెంట్ మూవీ. ఇలా విభిన్నంగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు వరుణ్ తేజ్.