ఇమోషనల్ గా కనెక్ట్ అయ్యాను – సాయి పల్లవి

Tuesday,March 06,2018 - 01:30 by Z_CLU

సాయి పల్లవి నాగశౌర్య జంటగా నటించిన ‘కణం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. ఇమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ తో పాటు సాంగ్స్ ఆడియెన్స్ లో క్యూరాసిటీ జెనెరేట్ చేస్తున్నాయి. ఫిదా, MCA తరవాత డిఫెరెంట్ జోనర్ లో, ఇమోషనల్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేయనుంది సాయి పల్లవి ఈ సినిమాలో. ‘కణం’ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ ఉన్న సాయి పల్లవి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడింది.

 “తల్లీ కూతుళ్ళ మధ్య ఉండే తపనే ‘కణం’ సినిమా. ఈ సినిమా చేసే ప్రాసెస్ లో బేబీ వెరోనికా తో చాలా కనెక్ట్ అయిపోయాను. ఈ సినిమాకి నా గత సినిమాలకి చాలా డిఫెరెన్స్ ఉంటుంది. ఈ సినిమాలో ఇమోషన్స్ ఎక్కువ. వాటికి తగ్గట్టు అందరం కనెక్ట్ అయి సినిమా చేశాం. స్పెషల్ గా నేను, వెరోనికా తల్లీ, కూతుళ్ళలా కలిసిపోయాం. కొన్ని సిచ్యువేషన్స్ లో నాగశౌర్య పర్ఫామెన్స్ అద్భుతమనిపిస్తుంది’ అని చెప్పుకుంది సాయి పల్లవి.

 

L.  విజయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజవుతుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాని N.V. ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.