శర్వానంద్ బర్త్ డే స్పెషల్

Tuesday,March 06,2018 - 11:52 by Z_CLU

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో శర్వానంద్ ఈ రోజు తన పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం 2 సినిమాలకు కమిట్ అయ్యాడు. వీటిలో ఒకటి హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తోంది. ఈ సినిమాకు పడి పడి లేచే మనసు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఇక శర్వానంద్ అంగీకరించిన మరో సినిమా త్వరలోనే సుధీర్ వర్మ దర్శకత్వంలో సెట్స్ పైకి రానుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా ఇది. ఇలా డిఫరెంట్ గా స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్నాడు శర్వానంద్.

ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు, కెరీర్ స్టార్టింగ్ నుంచి శర్వానంద్ రూటు సెపరేటు. గమ్యం, ప్రస్థానం, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా, శతమానంభవతి, మహానుభావుడు.. ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తూనే.. సక్సెస్ లు కూడా అందుకుంటున్నాడు శర్వానంద్.

యువసేన లాంటి సక్సెస్ తో కెరీర్ స్టార్ట్ చేసిన శర్వానంద్.. ఎప్పుడూ మూసలో పడిపోలేదు. ఫ్లాపులొచ్చినా కొత్తదనం కోసమే ప్రయత్నించాడు. అదే అతడ్ని ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా నిలబెట్టింది. ఇలాంటి సక్సెస్ ఫుల్ బర్త్ డే లు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శర్వానంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.