Varun Tej Ghani - చివరి ఆట మొదలైంది

Saturday,July 10,2021 - 05:47 by Z_CLU

మెగాప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోగా అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మిస్తోన్న చిత్రం ‘గని’. వ‌రుణ్‌తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌న‌టువంటి డిఫ‌రెంట్ లుక్‌తో బాక్సర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌లో స్పెషల్‌ ట్రైనింగ్‌ తీసుకుని నటిస్తుండటం విశేషం. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ఆగిన ఈ సినిమా షూటింగ్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో పునః ప్రారంభమైంది.

Varun Tej Ghani movie zeecinemalu

ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ అంతా పూర్తవుతుంది. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ ఇది. అందులో భాగంగా ఈ షెడ్యూల్‌లో క్లైమాక్స్‌ సహా భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ఆధ్వ‌ర్యంలో భారీ సెట్స్‌లో ఈ యాక్షన్‌ పార్ట్‌ చిత్రీకరణ జరుగుతుంది. ఈ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

Heroine Saiee Manjrekar zeecinemalu

బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ ఇందులో హీరోయిన్. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics