#MandulodaSong - సాంగ్ సూపర్ హిట్

Saturday,July 10,2021 - 05:36 by Z_CLU

సుదీర్ బాబు హీరోగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్‘ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజయింది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో సూపర్ హిట్ అందిపించుకుంటూ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంటుంది. ‘మందులోడ’ అంటూ వచ్చే ఈ ఐటెం సాంగ్ సినిమాలో హైలైట్ కానుందని విజువల్స్ చూస్తుంటే అర్థమవుతుంది.

ఈ మాస్ సాంగ్ లో సుదీర్ బాబు ఎనర్జిటిక్ డాన్స్ , స్నేహ గుప్తా హాట్ స్టెప్స్ హైలైట్ నిలవనున్నాయని సాంగ్ గ్లిమ్ప్స్ చూస్తుంటే తెలుస్తుంది. ముఖ్యంగా యశ్వంత్ ఎనర్జిటిక్ కొరియోగ్రఫీ, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ విజువల్ గా సాంగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందనడంలో సందేహం లేదు. స్వర బ్రహ్మ మణిశర్మ మాస్ బీట్ కి తనదైన మాసి లిరిక్స్ తో సాంగ్ కి మరింత అందం తీసుకొచ్చాడు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్. సాంగ్ లో లిరిక్స్ మాస్ ని బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రస్తుతం మాయలోడ అంటూ ఒక ఊపు ఊపేస్తున్న ఈ సాంగ్ 1 మిలియన్ వ్యూస్ చేరువలో ఉంది. సాహితీ, ధనుంజయ్ సింగింగ్ కూడా సాంగ్ ప్లస్ అయింది.

Sridevi Soda Centre movie Sudheer Babu

‘శ్రీదేవి సోడా సెంటర్’లో సుధీర్ బాబు

70mm ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సుదీర్ బాబు సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేసి ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచనున్నారు. ‘పలాస 1978’ సినిమా తర్వాత దర్శకుడు కరుణ కుమార్ నుండి వస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ తో మంచి అంచనాలు నెలకొల్పింది. మరి రిలీజ్ తర్వాత సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics