ఫస్ట్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్న Ghani

Tuesday,January 19,2021 - 12:51 by Z_CLU

కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో Varun Tej హీరోగా నటిస్తున్న సినిమాకు ‘Ghani’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘బాలు’ సినిమాలో పవన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ పేరు గని అని తెలిసిందే. ఇప్పుడు బాబాయ్ క్యారెక్టర్ పేరునే తన 10వ సినిమాకు టైటిల్ గా పెట్టుకున్నాడు మెగా ప్రిన్స్.  ఈరోజు వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. పోస్టర్ లో కిక్ బ్యాగ్ కి పవర్ ఫుల్ పంచ్ ఇస్తూ బాక్సర్ లుక్ లో వరుణ్ తేజ్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు.

బాక్సింగ్ నేపథ్యంలో యాక్షన్ డ్రామా తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరో ఉపేంద్ర విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమవుతుంది.  ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను అల్లు బాబీ , సిద్దు నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.