Nagarjuna Naga Chaitanya - బాలీవుడ్ కనెక్షన్

Sunday,July 11,2021 - 07:32 by Z_CLU

నాగార్జుననాగచైతన్య ఒకేసారి రెండు బాలీవుడ్ సినిమాలు ఎంచుకొని అందులో మంచి పాత్రలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అక్కినేని నాగార్జున #Brahmastra అనే హిందీ  సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే తన పోర్షన్ కి సంబంధించి షూట్ ఫినిష్ చేసుకొచ్చాడు నాగ్. ఇక తండ్రి దారిలోనే తను కూడా ఓ హిందీ సినిమలో మంచి రోల్ చేస్తున్నాడు చైతు.

naga chaitanya amir khan 1

అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న #Lalsinghchaddha సినిమాలో చైతు ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. సినిమాలో అమీర్ ఖాన్ స్నేహితుడి పాత్రలో జవాన్ గా కనిపించనున్నాడు చైతు. ఆర్మీ క్యారెక్టర్ కోసం తన లుక్ చేంజ్ చేసి ప్రస్తుతం సినిమా షూటింగ్ పాల్గొంటున్నాడు చైతు. ఇలా ఒకేసారి అక్కినేని తండ్రి కొడుకులు హిందీలో సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది.

nagarjuna brahmastra

బ్రహ్మాస్త్ర త్వరలోనే రిలీజ్ కానుంది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని కానీ మొదటి భాగం సక్సెస్ ని బట్టి అది ప్లాన్ చేసుకుంటారని నాగ్ ఇటివలే ఓ ప్రెస్ మీట్ లో చెప్పుకున్నారు. ఒక వేళ సెకండ్ పార్ట్ ఉంటె అందులో కూడా నాగ్ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉంది. మరి నాగార్జున , నాగచైతన్య హిందీ సినిమాల్లో తమ పాత్రలతో ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తారో చూడాలి.

త్వరలోనే నాగ్, చైతు కలిసి బంగార్రాజు సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇది సోగ్గాడు చిన్ని నాయన సినిమాకు సీక్వెల్ గా రానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. నాగ్, చైతూ బాలీవుడ్ లో క్లిక్ అయితే.. వాళ్లు కలిసి చేయబోయే బంగార్రాజు సినిమా కచ్చితంగా బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics