Varun Tej Sai Pallavi - బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్?

Tuesday,May 18,2021 - 02:57 by Z_CLU

బెస్ట్ లవ్ స్టోరీస్ లో నటించిన జోడీలను ఎప్పటికీ మర్చిపోరు ప్రేక్షకులు. వరుణ్ -సాయి పల్లవిలది కూడా అలాంటి ఓ జోడి. ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ కాంబో లో మరో సినిమా తెరకెక్కనుందని, మళ్ళీ ఓ లవ్ స్టోరీ తో ఈ ఇద్దరు ఆడియన్స్ ముందుకు రానున్నారని ప్రచారం జరుగుతుంది. వివరాల్లోకి వెళితే వరుణ్ తేజ్ తో సూపర్ హిట్ డైరెక్టర్ వెంకీ కుడుముల తన మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ కాంబో సినిమా ఆల్మోస్ట్ ఫిక్సయింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు వెంకీ.

fidaa-movie-stills-varun-tej-sai-pallavi-zee-cinemalu

వెంకీ కుడుముల వరుణ్ తేజ్ కాంబోలో రాబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం సాయి పల్లవి డేట్స్ కోసం మేకర్స్ ప్రయత్నిస్తున్నారని టాక్. సాయి పల్లవి ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. మరి తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తన మొదటి హీరో కోసం డేట్స్ అడ్జస్ట్ చేసి సినిమాకు సైన్ చేస్తే ఫిదా కాంబో ను మరోసారి వెండితెరపై చూడొచ్చు.

varun-tej-ghani-july-30-release2

ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడుతో బాక్సింగ్ నేపథ్యంలో ‘గని’ అనే సినిమా చేస్తున్నాడు వరుణ్. లాక్ డౌన్ నేపథ్యం షూటింగ్ వాయిదా పడింది. త్వరలోనే ఫైనల్ షెడ్యుల్ తో ఆ సినిమా షూట్ కంప్లీట్ అవ్వనుంది. ఆ సినిమాకి గుమ్మడి కాయ కొట్టగానే వెంకీ కుడుముల సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు మెగా ప్రిన్స్. ‘ఛలో’,’భీష్మ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకున్న వెంకీ కుడుముల ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడితే ఇక స్టార్ డైరెక్టర్ లిస్టులోకి చేరినట్టే.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics