వరుణ్ తేజ్ – రాశిఖన్నాల రియల్ లైఫ్ తొలిప్రేమ

Thursday,February 15,2018 - 10:05 by Z_CLU

వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ సూపర్ హిట్టయింది. ఫిబ్రవరి 10 న రిలీజైన ఈ సినిమా, యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. రిలీజైన ఫస్ట్ డే నుండే సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా, వ్యాలెంటైన్ సీజన్ కి పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అనిపించుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన వరుణ్ తేజ్, రాశిఖన్నా తమ లైఫ్ లోని ఫస్ట్ లవ్ గురించి రివీల్ చేశారు.

స్కూల్ డేస్ లో ఉండగా ఏకంగా ముగ్గురికి వ్యాలెంటైన్స్ డే రోజు గులాబీలిచ్చిన వరుణ్ తేజ్, అందులో ఒకమ్మాయిని సీరియస్ గా ఇష్టపడ్డానని చెప్పుకున్నాడు. ఆ విషయం తన క్లాస్ లో అందరికీ తెలుసని చెప్పిన వరుణ్, ఆ అమ్మాయికి తన లవ్ ని డైరెక్ట్ గా ప్రపోజ్ చేయలేపోయానన్నాడు. రాశిఖన్నా కూడా తన స్కూల్ డేస్  లో ఒక అబ్బాయికి ప్రపోజ్ చేసిందట. రీజన్స్ రివీల్ చేయలేదు కానీ, అది జస్ట్ క్రష్ గా మిగిలిపోయిందని చెప్పుకుంది.

ఇక పెళ్ళి విషయానికి వస్తే తనకు ప్రభాస్, నితిన్ లు తనకు  ఇన్స్ పిరేషన్ అని చెప్పుకున్న వరుణ్ తేజ్, పెళ్ళి అనేది పెద్ద ప్రపంచం అని, పెళ్ళి తప్పకుండా చేసుకుంటాను కానీ, దానికి ఇంకా చాలా టైముందని చెప్పాడు.