రవితేజ కాల్ కోసం వెయిట్ చేసేవాణ్ణి – నాని

Thursday,February 15,2018 - 11:06 by Z_CLU

ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజవుతుంది ‘అ!’. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న నాని ఈ సినిమాను నిర్మించడంతో న్యాచురల్ గానే ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. కంప్లీట్ డిఫెరెంట్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాని చేప క్యారెక్టర్ కి వాయిస్ ఇస్తే, మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో ‘బోన్సాయి మొక్క’ కు వాయిస్ ఇచ్చాడు. ఈ సందర్భంగా రవితేజతో తనకు ఉన్న రిలేషన్ ని గుర్తు చేసుకున్నాడు నాని.

‘యాక్టర్ అయినప్పటి నుండి ఇండస్ట్రీలో నాకెవరైనా తెలిసి ఉంటే అది రవితేజ గారే.. నా కరియర్ బిగినింగ్ లో ఏ సినిమా రిలీజైనా, ఆయన దగ్గర నుండి కాల్ కంపల్సరీగా వచ్చేది. నేను కూడా ఆయన కాల్ వస్తుందని వెయిట్ చేస్తుండే వాడిని. అలాంటిది… ఆయన నేను నిర్మించిన సినిమాకి వాయిస్ ఇచ్చారు. ఇంకా ఈ సినిమాలో నేను ఆయన్ని రారా.. పోరా అనే సిచ్యువేషన్స్ ఉంటాయి… అలాంటప్పుడు అనిపించేది ఆయనెక్కడ..? నేనెక్కడ అని…’ అని రవితేజతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకున్నాడు నాని.

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా కసాంద్ర తో అవసరాల శ్రీనివాస్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాకి మార్క్ K. రాబిన్ మ్యూజిక్ కంపోజర్.